ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కు మూడు స్వర్ణాలు
Sakshi Education
పోలాండ్‌లోని వ్రోక్లా నగరంలో జరుగుతున్న ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు.
ఆగస్టు 14న మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు.క్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించి స్వర్ణ కైవసం చేసుకుంది. క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో కుశాల్ దలాల్, సాహిల్ చౌదరీ, నితిన్‌లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచి బంగారు పతకాన్ని సాధించింది. కాంపౌండ్ మిక్స్‌డ్ ఫైనల్లో ప్రియా–కుశాల్ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గి పసిడి పతకాన్ని గెలిచింది.
క్యాడెట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్ 136–139తో సెలెన్ రోడ్రిగెజ్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్ 140–135తో హేలీ బౌల్టన్ (బ్రిటన్)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందామ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్ యాదవ్ 146–145తో సెబాస్టియన్ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కు మూడు స్వర్ణాలు
ఎప్పుడు : ఆగస్టు14
ఎక్కడ : వ్రోక్లా, పోలాండ్
ఎందుకు :ఫైనల్లోక్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్, క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్,కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విజయాలు సాధించినందున...

Published date : 16 Aug 2021 06:39PM