ఆఫ్రికాలో 3 లక్షల మంది మరణిస్తారు: యూఎన్
Sakshi Education
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసినప్పటికీ 2020 ఏడాది ఆఫ్రికా ఖండంలో 3 లక్షల మరణాలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక కమిషన్ ఆఫ్రికా విభాగం అంచనా వేసింది.
దక్షిణాఫ్రికాకు భారత్ సహకారం: మోదీ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తక్షణమే సరఫరా చేస్తామని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో కోవిడ్ మహమ్మారిపై చర్చించినట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్‌సీసీతోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభం గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మృతుల సంఖ్య 33 లక్షల వరకు కూడా ఉంటుందని హెచ్చరించింది. భౌతిక దూరం కఠినంగా అమలు చేసినప్పటికీ 12 కోట్ల మందికిపైగా వైరస్ సోకుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆఫ్రికాలో కరోనా కేసులు 20 వేలకు చేరుకున్నాయి.
దక్షిణాఫ్రికాకు భారత్ సహకారం: మోదీ
కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తక్షణమే సరఫరా చేస్తామని ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు హామీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాపోసాతో కోవిడ్ మహమ్మారిపై చర్చించినట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్‌సీసీతోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభం గురించి చర్చించినట్టు ప్రధాని వెల్లడించారు.
Published date : 18 Apr 2020 06:40PM