Skip to main content

అఫ్గాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్న దేశం?

అఫ్గానిస్తాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.
Current Affairs
ఈ ప్రక్రియ 2021, మే 1న ప్రారంభమై సెప్టెంబర్‌ 11 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఏప్రిల్‌ 15న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బైడెన్‌ ఈ వివరాలు తెలిపారు.

బైడెన్‌ ప్రసంగం–ముఖ్యాంశాలు
  • అమెరికా అత్యధిక కాలం చేసిన యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది.
  • ఏటా కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తూ ఒకే దేశంలో వేలాది సైనికులను మోహరించడం అర్థం లేని చర్య.
  • అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొనడం కోసం భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, టర్కీలు మరిన్ని చర్యలు చేపట్టాలి.
  • 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిగిన దాడికి ఇరవై ఏళ్లయ్యేనాటికి అమెరికా, నాటో దళాలు, ఇతర భాగస్వామ్యులు అఫ్గాన్‌ నుంచి వైదొలగుతాయి.

2001 నుంచి...

అఫ్గాన్‌లో 2001 నుంచి కొనసాగుతున్న యుద్ధంతో లక్షల కోట్ల డాలర్ల ఖర్చుతో పాటు దాదాపు 2400 మంది సైనికుల ప్రాణాలను అమెరికా కోల్పోయింది. బైడెన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే నాటికి సుమారు 3 వేల అమెరికా బలగాలు అఫ్గాన్‌లో ఉన్నాయి.

భారత్‌కు ఆందోళనకరం
అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలగితే ఆ ప్రాంతం మళ్లీ ఉగ్రవాద సంస్థలకు సురక్షిత ప్రదేశంగా మారే ప్రమాదముంది. తాలిబన్‌ మళ్లీ మరింత క్రియాశీలమయ్యే అవకాశముంది. అమెరికా తాజా నిర్ణయంతో భారత్‌కు ఉగ్ర ముప్పు మరింత పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం.
Published date : 17 Apr 2021 04:37PM

Photo Stories