Skip to main content

అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీకి ఆశ్రయం కల్పించిన దేశం?

తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీకి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది.
మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించామని యూఏఈ విదేశాంగ శాఖ ఆగస్టు 18న తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాలిబన్లతో కర్జాయ్‌ చర్చలు
తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్‌ హక్కానీ బుధవారం అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీకి ఆశ్రయం కల్పించిన దేశం?
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)
ఎక్కడ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)
ఎందుకు : మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించామని...
Published date : 19 Aug 2021 06:33PM

Photo Stories