Skip to main content

అప్రూవర్‌గా మారేందుకు సక్సేనాకు అనుమతి

అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారేందుకు పటియాల హౌజ్ కోర్టు మార్చి 25న అనుమతినిచ్చింది.
కేసుకు సంబంధించిన సమాచారం మొత్తాన్నీ తాను వెల్లడిస్తాననీ, తనకు శిక్షను రద్దు చేయాలంటూ సక్సేనా వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో సక్సేనా అప్రూవర్‌గా మారితే తమకేమీ అభ్యంతరం లేదనీ, విచారణకు ఆయన చెప్పే విషయాలు పనికొస్తాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ కోర్టుకు తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అప్రూవర్‌గా మారేందుకు రాజీవ్ సక్సేనాకు అనుమతి
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : పటియాల హౌజ్ కోర్టు
ఎక్కడ : అగస్టా వెస్ట్‌లాండ్ మనీ లాండరింగ్ కేసులో
Published date : 26 Mar 2019 05:36PM

Photo Stories