Skip to main content

AP Lokayukta: ఏపీ లోకాయుక్త కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటైంది?

కర్నూలు నగరంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది.
నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోని మూడో గదిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఆగస్టు 28న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి ప్రారంభించి.. తన చాంబర్‌లో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ... ప్రజలు లోకాయుక్త గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందన్నారు.

గోరటికి గిడుగు రామ్మూర్తి పురస్కారం
ఎమ్మెల్సీ, ప్రముఖ గేయ రచయిత గోరటి వెంకన్నతో పాటు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డాక్టర్‌ అనూహ్యరెడ్డిలకు గిడుగు రామ్మూర్తి జీవన సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను గ్రహీతలకు అందించారు. కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు క్రాంతికృష్ణ పాల్గొన్నారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణరెడ్డి
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా
Published date : 31 Aug 2021 01:44PM

Photo Stories