Skip to main content

ఆన్‌టాప్ టీఎల్‌టీఆర్‌ఓ స్కీమ్ ప్రకటన

బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అక్టోబర్ 21న ‘ఆన్‌టాప్’ టార్గెటెడ్ దీర్థకాలిక రెపో ఆపరేషన్స్ (టీఎల్‌టీఆర్‌ఓ) స్కీమ్‌ను ప్రకటించింది.
Current Affairs
వ్యవసాయం, రిటైల్, ఔషధాలు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకుసహా ప్రధాన రంగాలకు ఎటువంటి ద్రవ్య పరమైన ఇబ్బందులూ తలెత్తకుండా చూడ్డం ఈ ప్రకటన ప్రధాన ఉద్దేశం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రసుతం 4 శాతం) రేటు ప్రాతిపదికన బ్యాంకులకు నిధులు సమకూర్చడం టీఎల్‌టీఆర్‌ఓ ఉద్దేశం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆన్‌టాప్ టీఎల్‌టీఆర్‌ఓ స్కీమ్ ప్రకటన
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
ఎందుకు : బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) లక్ష్యంగా
Published date : 22 Oct 2020 06:00PM

Photo Stories