అంతరిక్షంలోకి శ్రీలంక, నేపాల్ ఉపగ్రహాలు
Sakshi Education
శ్రీలంక, నేపాల్ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోని జపాన్‌కు చెందిన కిబో మాడ్యూల్ ద్వారా కక్ష్యలోకి చేరాయి.
శ్రీలంకకి చెందిన రావణ-1 ఉపగ్రహం 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తూ శ్రీలంక, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఇది ఫొటో తీయడం సహా పలురకాల విధులను నిర్వర్తిస్తుంది. శ్రీలంకలోని పెరాడినియా విశ్వవిద్యాలయం, ఆర్థర్ సి క్లార్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మోడర్న్ టెక్నాలజీస్ విద్యార్థులు రూపొందించిన రావణ-1 ఏడాదిన్నర పాటు సేవలందించనుంది. నేపాల్‌కు చెందిన నేపాలీశాట్-1 ఉపగ్రహాన్ని అబ్బాస్ మాష్కే, హరిరామ్ శ్రేష్ఠ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు.
Published date : 19 Jun 2019 06:11PM