Skip to main content

అంతరిక్షంలోకి సోలార్ ఆర్బిటర్ నౌక

అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడి ధృవాల చిత్రాలను మనకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లు సంయుక్తంగా తయారు చేసిన ‘సోలార్ ఆర్బిటర్’ అంతరిక్ష నౌక ఫిబ్రవరి 10న నింగిలోకి దూసుకెళ్లింది.
Current Affairsదాదాపు రూ.10 వేల కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్-వీ రాకెట్ సాయంతో నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతమైన సంకేతాలు జర్మనీలోని యురోపియన్ స్పేస్ సెంటర్‌కు అంతరిక్ష నౌక నుంచి వచ్చినట్లు నాసా తెలిపింది.

బుధగ్రహం కక్ష్యలో...
సూర్యుడి ఫొటోలను తీసేందుకు సోలార్ ఆర్బిటర్ బుధగ్రహం కక్ష్యలో తిరగనుంది. బుధగ్రహం చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు మానవుడు కనిపెట్టని సూర్యుడి ధృవాల చిత్రాలను తీయనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతరిక్షంలోకి సోలార్ ఆర్బిటర్ నౌక
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : నాసా, ఈఎస్‌ఏ
ఎక్కడ : కేప్ కెనవరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, ఫ్లోరిడా, అమెరికా
ఎందుకు : సూర్యుడి ధృవాల చిత్రాలను చిత్రీకరించేందుకు..
Published date : 11 Feb 2020 05:30PM

Photo Stories