అంగారకుడిపై కంపనాలు
Sakshi Education
అంగారకుడిపై మొదటిసారి కంపనాలకు సంబంధించిన శబ్దాలు రికార్డయ్యాయి.
మార్స్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన ‘ఇన్‌సైట్’ అంతరిక్ష నౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తించింది. ఇన్‌సైట్‌లో అమర్చిన సిస్మిక్ ఎక్స్‌పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్‌ఈఐఎస్) పరికరం ఏప్రిల్ 6వ తేదీన ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. 2018, మేలో ఇన్‌సైట్‌ను ప్రయోగించగా డిసెంబర్‌లో సిసిమోమీటర్‌ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారకుడిపై కంపనాలు గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ప్రయోగించిన ఇన్‌సైట్ అంతరిక్ష నౌక
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారకుడిపై కంపనాలు గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ప్రయోగించిన ఇన్‌సైట్ అంతరిక్ష నౌక
Published date : 26 Apr 2019 06:52PM