అమెరికా క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘మైన్యూట్‌మ్యాన్ 3’ని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా మిలిటరీ ప్రకటించింది.
ఆయుధరహితమైన ఈ క్షిపణిని అక్టోబర్ 2న కాలిఫోర్నియా నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా మార్షల్ ద్వీపాల్లోని క్వాజాలైన్ అటోల్‌కు ప్రయోగించినట్లు వెల్లడించింది. ఈ క్షిపణి 6,750 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పేర్కొంది. తాజా పరీక్షకు, ప్రస్తుత ప్రపంచంలోని పరిణామాలకు, ప్రాంతీయ సమస్యలకు ఏ సంబంధం లేదని అమెరికా స్పష్టంచేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైన్యూట్‌మ్యాన్ 3 అనే బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : అమెరికా
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైన్యూట్‌మ్యాన్ 3 అనే బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : అమెరికా
ఎక్కడ : కాలిఫోర్నియా, అమెరికా
Published date : 03 Oct 2019 05:39PM