Skip to main content

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియన్ విజయం సాధించారు.
Current Affairs
దీంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా 77 ఏళ్ల బెడైన్ శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా దేవి హ్యారిస్ రికార్డుసృష్టించనున్నారు. నవంబర్ 7న జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బెడైన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 290 ఓట్లు బెడైన్ ఖాతాలో జమయ్యాయి. ఇంకా జార్జియా(16,) నార్త్ కరోలినా(15) అలాస్కా(3) రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు.

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో 214 ఓట్లు మాత్రమే జమయ్యాయి. ట్రంప్ ఈ ఎన్నికల ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్. బుష్ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకై క అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ ఆరోపణలు చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో విజయం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియన్
Published date : 09 Nov 2020 05:51PM

Photo Stories