Skip to main content

ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీస్‌ అంచనాల ప్రకారం... 2021లో భారత్ వృద్ధి

భారత్‌ ఎకానమీకి సంబంధించి 2021 ఏడాది వృద్ధి విషయంలో తొలి అంచనాలకు కోతలు కొనసాగుతున్నాయి.
Current Affairs
తాజాగా ఈ వరుసలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణ సంస్థ– ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీస్‌ చేరింది. 2021లో భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 10.2 శాతానికి పరిమితం అవుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. క్రితం అంచనాలు 11.8 శాతాన్ని ఈ మేరకు దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఏప్రిల్ 26న తెలిపింది. కరోనాసెకండ్‌వేవ్‌ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

భారత్ వృద్ధిపై మరికొన్ని సంస్థల అంచనాలు...
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 2021లో భారత్‌ వృద్ధిని 12.5 శాతం వరకూ అంచనావేస్తోంది.
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 11 శాతం ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అంచనా వేసింది.
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా 10.5 శాతంగా ఉంది.
  • 2020–21 ఎకనమిక్‌ సర్వే 2021–22 ఏడాది వృద్ధి రేటును 11 శాతంగా పేర్కొంది.

2021–22 అంచనా సవరణలు ఇలా..
 

సంస్థ

తాజా

తొలి

ఇక్రా

10.5

11

కేర్‌

10.2

10.7

ఇండ్‌ రా

10.1

10.4

ఎస్‌బీఐ

10.4

11



క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 2021 ఏడాదిలోభారత్ వృద్ధి రేటు 10.2 శాతంగా నమోదవుతుంది.
ఎప్పుడు : ఏప్రిల్‌ 26
ఎవరు : ఆక్స్‌ఫర్డ్‌ ఎకానమీస్‌
ఎందుకు:. కరోనాసెకండ్‌వేవ్‌ నేపథ్యంలో వృద్ధి రేటు మందగించడంతో...
Published date : 28 Apr 2021 12:00PM

Photo Stories