ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో 26 నూతన భారతీయ పదాలు
Sakshi Education
ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు తాజా ముద్రణలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలు స్థానం సంపాదించాయి.
వీటిలో తరుచూ వాడుకలో ఉండే ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ మొదలగు పదాలు ఉన్నాయి. జనవరి 24న విడుదలైన తాజా(10వ) ఎడిషన్‌లో భారతీయ పదాలు సహా ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్ లాంటి 1,000కి పైగా కొత్త పదాలను చేర్చినట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్ తెలిపింది. 26 కొత్త భారతీయ పదాల్లో 22 పదాలను డిక్షనరీలో ప్రచురించామని, మిగతా నాలుగు పదాలు డిజిటల్ వర్షన్‌లో ఉన్నాయని వివరించింది. తాజా ఎడిషన్‌లో వినియోగదారుల సహయార్థం వెబ్‌సైట్, యాప్ లాంటి ఆన్‌లైన్ సేవలనూ కల్పిస్తున్నట్టు వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు 10వ ఎడిషన్ విడుదల
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు 10వ ఎడిషన్ విడుదల
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ(ఓయూపీ) ప్రెస్
Published date : 25 Jan 2020 05:38PM