Skip to main content

ఐసీసీ వన్డే, టి20 జట్లలో స్మృతి మంధాన

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డిసెంబర్ 17న వార్షిక పురస్కారాలు-2019ను ప్రకటించింది.
Current Affairs2019 ఏడాది కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ వార్షిక అవార్డులు, వుమెన్ టీమ్స్ ఆఫ్ ఇయర్‌ను ఎంపిక చేస్తారు. ఇందులో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు ఐసీసీ వన్డే, టి20 జట్లలో చోటు దక్కింది. 23 ఏళ్ల స్మృతి రెండు టెస్టులతోపాటు 51 వన్డేలు, 66 టి20లు ఆడింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఆమె 3476 పరుగులు చేసింది.

ఐసీసీ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి స్మృతితో పాటు బౌలర్లు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండేలకు చోటు దక్కగా... టి20 జట్టులో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ఎంపికయ్యారు. ఐసీసీ ఇరు జట్లకు మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎలిస్ పెర్రీ
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2019గా ఆస్ట్రేలియాకి చెందిన ఎలీస్ పెర్రీ ఎంపికైంది. అలాగే టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అలీస్సా హీలీ (ఆస్ట్రేలియా) ఎంపికైంది. మరోవైపు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచే వాళ్లకిచ్చే ‘రాచెల్ హేహో-ఫ్లింట్’అవార్డు సైతం ఎలీస్ పెర్రీని వరించింది. ఇక ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు చనిద సుథిరంగ్ (థాయ్‌లాండ్)ను వరించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐసీసీ వన్డే, టి20 జట్లలో స్మృతి మంధాన
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
Published date : 18 Dec 2019 05:50PM

Photo Stories