ఐరాస సమావేశాల్లో తొలిసారి ఇమ్రాన్
Sakshi Education
ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27న జరిగిన ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగిస్తూ.. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమే వస్తే.. దాని విపరిణామాలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని అంతర్జాతీయ సమాజంపై బెదిరింపులకు దిగారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కశ్మీర్లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ తొలగించిన తరువాత అక్కడ నెత్తుటేరులు పారకుండా ఉంటాయా? అంటూ హెచ్చరించారు. అహంకారం మోదీని గుడ్డివాడిని చేసిందని వ్యాఖ్యానించారు.
చైనాలో ముస్లింల బాధలు పట్టవా : అమెరికా
కశ్మీర్‌లో ముస్లింలకు మానవ హక్కులు కరువయ్యాయంటూ పదేపదే ప్రస్తావించే పాకిస్తాన్.. చైనా వ్యాప్తంగా ముస్లింలపై కొనసాగుతున్న నిర్బం ధంపై ఎందుకు పెదవి విప్పడం లేదని అమెరికా నిలదీసింది. అమెరికా తాత్కాలిక సహాయ కార్యదర్శి (దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత వ్యవహారాలు) అలిస్ వెల్స్ ఐరాస సమావేశంలో మాట్లాడుతూ... ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Published date : 28 Sep 2019 05:31PM