ఐరాస భద్రతా మండలికి వియత్నాం ఎన్నిక
Sakshi Education
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అయిదు శాశ్వతేతర సభ్యత్వ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆసియా దేశాల ప్రతినిధిగా వియత్నాం ఏకగ్రీవంగా ఎన్నికైంది. వియత్నాం
అభ్యర్థిత్వాన్ని 193 దేశాల ఐరాస జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుత ఆసియా ప్రతినిధి కువైట్ రెండేళ్ల పదవీ కాల పరిమితి 2018 చివరి నాటికి ముగియనుంది. దాని స్థానంలో వచ్చే సంవత్సర ఆరంభంలో వియత్నాం భద్రతామండలిలో ప్రవేశిస్తుంది.
అలాగే లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల నుంచి సెయింట్ విన్సెంట్, గ్రెనైడియన్ దేశాలు ఎన్నికయ్యాయి. ఆఫ్రికా స్థానాలకు ట్యూనిషియా, నైగర్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా తూర్పు ఐరోపా స్థానానికి జరిగిన పోటీలో ఎస్తోనియా రుమేనియాపై విజయం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐరాస భద్రతామండలి ఆసియా దేశాల ప్రతినిధిగా ఎంపిక
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : వియత్నాం

Published date : 11 Jun 2019 06:30PM