Skip to main content

ఐపీయూ సదస్సులో స్పీకర్ ఓం బిర్లా

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ వేదికగా జరుగుతున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) సదస్సులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం పాల్గొంది.
ఈ సదస్సులో పాకిస్థాన్ ప్రతినిధి బృందం కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత పార్లమెంటరీ బృందం సభ్యుడు శశిథరూర్ తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఐక్యరాజ్యసమతి గుర్తించిన 25 ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నాయి. అలాంటి దేశం కశ్మీర్‌లో మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం కాక మరేంటి?’’ అని శశిథరూర్ అన్నారు.
Published date : 18 Oct 2019 05:40PM

Photo Stories