ఐపీఎల్ తరహాలో ఖో-ఖో లీగ్
Sakshi Education
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలో ఖో-ఖో లీగ్‌ను నిర్వహించనున్నట్లు భారత ఖో-ఖో సమాఖ్య ఏప్రిల్ 2న ప్రకటించింది.
2019, సెప్టెంబర్-అక్టోబర్‌లో ‘అల్టిమేట్ ఖో ఖో’ పేరుతో ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఖోఖో సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు రెండేసి సార్లు తలపడే ఫార్మాట్‌లో మొత్తం 60 మ్యాచ్‌లతో 21 రోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు.
ఖో-ఖో లీగ్‌లో భారత్‌తో పాటు దక్షిణ కొరియా, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొననున్నారు. ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు చొప్పున ఉంటారు. డాబర్ గ్రూప్ వైస్ చైర్మన్ అమిత్ బర్మన్ తన వ్యక్తిగత హోదాలో ఖో-ఖో లీగ్ నిర్వహణ హక్కులు తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐపీఎల్ తరహాలో ఖో-ఖో లీగ్
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : భారత ఖో-ఖో సమాఖ్య

Published date : 03 Apr 2019 06:18PM