ఐపీఎల్-12 ప్రారంభ వేడుకలు రద్దు
Sakshi Education
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభ వేడుకలు రద్దయ్యాయి.
ఈ కార్యక్రమానికి కేటాయించిన డబ్బును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందించడానికి బీసీ సీఐ క్రికెట్ పాలకుల కమిటీ(సీవోఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 22న జరిగిన బీసీసీఐ, సీవోఏ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. కాగా, ఏటా ఐపీఎల్ సీజన్ మొదటి రోజు బాలీవుడ్ నటీనటులు, గాయకులతో అద్భుతమైన వేడుకలు నిర్వహించే సంగతి తెలిసిందే. మిరుమిట్లు గొలిపే బాణసంచా కాలుస్తారు. ‘ఈసారి ఐపీఎల్ ఆరంభ వేడుకలు నిర్వహించడం లేదు. అందుకు కేటాయించిన డబ్బును అమరుల కుటుంబాలకు అందజేస్తాం’ అని క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఐపీఎల్-12 ప్రారంభ వేడుకలు రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎందుకు : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సాయం కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఐపీఎల్-12 ప్రారంభ వేడుకలు రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎందుకు : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సాయం కోసం
Published date : 23 Feb 2019 06:12PM