ఐఏఎఫ్ పైలట్ అభినందన్ బదిలీ
Sakshi Education
భారత పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత వాయుసేన(ఐఏఎఫ్) బదిలీ చేసింది.
ఆయన్ను ప్రస్తుతమున్న శ్రీనగర్ నుంచి పశ్చిమ సెక్టార్‌కు బదిలీ చేసినట్లు ఏప్రిల్ 20న ఐఏఎఫ్ తెలిపింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ బదిలీ చోటుచేసుకుందని పేర్కొంది. 2019, ఫిబ్రవరి 27న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్16 యుద్ధవిమానాన్ని అభినందన్ తన మిగ్21 ఫైటర్‌జెట్‌తో కూల్చడం, తర్వాత పాక్ సైన్యానికి చిక్కడం, తర్వాత భారత్‌కు అప్పగింత తెలిసిందే.
Published date : 22 Apr 2019 05:57PM