Skip to main content

ఐదేళ్లలో 1.09 కోట్ల చెట్ల నరికివేతకు అనుమతి

2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది.
Current Affairsఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో ఈ విషయాన్ని తెలియజేశారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016-19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు వెల్లడించారు.

చెట్ల నరికివేత

సంవత్సరం

చెట్లు(లక్షల్లో)

2014-15

23.3

2015-16

16.9

2016-17

17.01

2017-18

25.5

2018-19

17.38


భారత్‌లో తలసరికి 28 చెట్లే...
2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్‌లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి.
Published date : 24 Feb 2020 06:16PM

Photo Stories