Skip to main content

ఐఐటీ–హైదరాబాద్‌లోభారీ టెలిస్కోప్‌ ఆవిష్కరణ

ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ కీలక ముందడుగు వేసింది.

క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది.ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ బీఎన్‌ సురేశ్‌ ఆగస్టు 16న టెలిస్కోప్‌ను ప్రారంభించారు.ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్‌ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్‌ తర్వాత రెండోది) ఆప్టికల్‌ వ్యాసం కలిగిన భారీ లెన్స్‌ ఐఐటీ తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్‌లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకువిద్యార్థులకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో ఉపయోగపడుతుందనిహైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ మూర్తి తెలిపారు.

క్విక్‌ రివ్యూ
:
ఏమిటి :భారీ టెలిస్కోప్‌ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు16
ఎవరు :ఐఐటీ హైదరాబాద్‌
ఎక్కడ :ఐఐటీ హైదరాబాద్‌క్యాంపస్, కంది, సంగారెడ్డి జిల్లా
ఎందుకు :ఖగోళంపై అధ్యయనం చేసేందుకు...
Published date : 17 Aug 2021 04:24PM

Photo Stories