అగస్టా కేసులో వ్యాపారవేత్త సక్సేనా అరెస్ట్
Sakshi Education
అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనాతో పాటు రూ.90 కోట్ల నిధులను మళ్లించిన కేసులో నిందితుడు, లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను దుబాయ్ అధికారులు భారత్‌కు అప్పగించారు.
దీంతో ఢిల్లీలో జనవరి 31న వీరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సక్సేనాను అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టు ముందు ప్రవేశపెట్టగా నాలుగు రోజుల కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా, ఓ విదేశీ క్షిపణి తయారీ కంపెనీ నుంచి తన ఎన్జీవోకు వచ్చిన రూ.90.72 కోట్ల ను దారి మళ్లించిన కేసులో దీపక్ తల్వార్‌ను పటియాలా కోర్టు ఏడురోజుల కస్టడీకీ అనుమతించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితులు అరెస్ట్
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : రాజీవ్ సక్సేనా, దీపక్ తల్వార్
ఎక్కడ : ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితులు అరెస్ట్
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : రాజీవ్ సక్సేనా, దీపక్ తల్వార్
ఎక్కడ : ఢిల్లీ
Published date : 01 Feb 2019 05:03PM