Skip to main content

అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యంగ సవరణ-2019 బిల్లుకు జనవరి 12న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ప్రభుత్వం ప్రకటించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన ప్రజల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేరుస్తూ రాజ్యాంగంలోని 15వ, 16వ నిబంధనల్ని సవరించి ఈ చట్టం రూపొందించారు. ఈ చట్టం ద్వారా మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.

ఈ రిజర్వేషన్లకు అర్హులు ఎవరంటే...
  • వృత్తిగత, వ్యవసాయిక వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు.
  • 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారు.
  • నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 100 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు
  • నాన్ నోటిఫైడ్ మునిసిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు కలిగిన వారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Published date : 14 Jan 2019 04:47PM

Photo Stories