ఆధ్యాత్మిక రైలు.. రామసేతు ఎక్స్‌ప్రెస్
Sakshi Education
తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రైల్వే శాఖ నూతనంగా ఓ రైలును ప్రవేశపెట్టింది.
‘రామసేతు ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఫిబ్రవరి 28న ఈ రైలు చెన్నైలోని తంబారన్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 18 ప్రముఖ ఆలయాల సందర్శన అనంతరం తిరిగి మార్చి 3న చెన్నై చేరుకుంటుంది. ఈ ప్యాకేజ్‌లో రంగనాథస్వామి ఆలయం, జంబూకేశ్వరాలయం, ట్రిచీ, రామేశ్వరం, మధురై, తంజావూర్‌ల్లోని ఆలయాలను సందర్శించవచ్చు. స్లీపర్ క్లాస్ జర్నీ, ధర్మశాలల్లో వసతి, శాఖాహార భోజనం.. తదితర సౌకర్యాలను కల్పిస్తారు. ఈ ప్యాకేజీకి ఒక్కొక్కరికి రూ. 4885 చార్జి చేయనున్నట్లు ఐఆర్‌సీటీసీ ఫిబ్రవరి 19న ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రామసేతు ఎక్స్‌ప్రెస్
ఏప్పుడు : ఫిబ్రవరి 28
ఎక్కడ : చెన్నై
ఎందుకు : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం రామసేతు ఎక్స్‌ప్రెస్
ఏప్పుడు : ఫిబ్రవరి 28
ఎక్కడ : చెన్నై
ఎందుకు : తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన కోసం
Published date : 20 Feb 2019 06:01PM