Skip to main content

అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రతీ ఏటా ఆగస్టు 6న ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆగస్టు 3న ఆదేశాలు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు
ఎప్పుడు : ఆగస్టు3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
Published date : 05 Aug 2019 05:37PM

Photo Stories