85 దేశాల్లోకి డెల్టా వేరియంట్: డబ్ల్యూహెచ్‌ఓ
Sakshi Education
భారత్‌లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్–19 వేరియంట్ ‘డెల్టా’ను 85 దేశాల్లో గుర్తించారని జూన్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది.
మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరించింది. విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రధాన వేరియంట్‌గా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేరియంట్ల వారీగా ఆల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో, డెల్టా 85 దేశాల్లో గుర్తించారని వెల్లడించింది. ఈ నాలుగు ఆందోళనకారక వేరియంట్ల (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్) మ్యుటేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆల్ఫా సహా మిగతా వేరియంట్ల కన్నా డెల్టా అతి వేగంగా వ్యాప్తి చెందుతోందంది.
Published date : 25 Jun 2021 06:26PM