Skip to main content

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్

రష్యా అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు వ్లాదిమిర్ పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు.
Current Affairsపుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ మార్చి 12న ఆమోదించింది. 2020, ఏప్రిల్ 22న దేశవ్యాప్తంగా ఈ సవరణలపై ఓటింగ్ జరగనుంది. అంతకంటే ముందు రష్యా రాజ్యాంగ న్యాయస్థానం ఈ సవరణలను సమీక్షించనుంది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగేందుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : రష్యా పార్లమెంట్
Published date : 13 Mar 2020 05:30PM

Photo Stories