2021 జూన్ తర్వాతే వ్యాక్సిన్: డబ్ల్యూహెచ్‌వో
Sakshi Education
2021 ఏడాది జూన్ వరకు కరోనా వ్యాక్సిన్ విసృ్తతంగా అందుబాటులోకివచ్చే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది.
అన్ని ప్రయోగాలను దాటుకొని వ్యాక్సిన్ ఎంత సమర్థంగా ఎంత సురక్షితంగా పని చేస్తుందో తేలడానికి సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ సెప్టెంబర్ 4న పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం ఇప్పటివరకు తుది దశ ప్రయోగాల్లో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ 50 శాతం కూడా సురక్షితం కాదని మార్గరెట్ చెప్పారు.
రష్యా వ్యాక్సిన్ సురక్షితమే..
రష్యా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ సురక్షితమేనని లాన్సెట్ జర్నల్ ఓ పరిశోధనను వెలువరించింది. మొత్తం 76 మందిపై జరిపిన ట్రయల్స్‌లో తీవ్రమైన సైడ్ ఎఫెక్టులేమీ కనపడలేదని తెలిపింది.

Published date : 05 Sep 2020 05:21PM