Skip to main content

2020లో చంద్రయాన్-3 ?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం నిరాశకు గురైనా.. ఇస్రోలో పట్టుదలను పెంచింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తీరాలనే దృఢనిశ్చయానికి వచ్చిన ఇస్రో చంద్రయాన్-3 చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. తిరువనంత పురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం డెరైక్టర్ సోమనాథ్ అధ్యక్షతన పనిచేస్తున్న ఈ కమిటీ అక్టోబర్ నుంచి 4 సార్లు సమావేశమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు, ప్రణాళికలతో కూడిన నివేదిక ను ఇది సమర్పించనుంది. ఈ నివేదిక అందాక ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పట్టాలెక్కిస్తారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ విజయ వంతంగా పనిచేస్తున్నందున వచ్చే ఏడాది ల్యాండర్, రోవర్‌లనే చంద్రుడిపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
Published date : 15 Nov 2019 05:22PM

Photo Stories