2018-19లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం
Sakshi Education
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదైంది.
ఈ మేరకు కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) మే 31న గణాంకాలను విడుదల చేసింది. వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయి. ఇక 2018-19 తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, రెండో క్వార్టర్‌లో 7.1 శాతంగాను, మూడో త్రైమాసికంలో 6.6 శాతంగాను నమోదైంది. 2017-18లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం నమోదైన విషయం విదితమే.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో నెలకొన్న సంక్షోభాలు మొదలైన తాత్కాలిక అంశాలు నాలుగో త్రైమాసికంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018-19లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో)

Published date : 01 Jun 2019 05:40PM