Skip to main content

15వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) పదవీ కాలాన్ని కేంద్ర కేబినెట్ పొడిగించింది.
Current Affairsకమిషన్ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు నవంబర్ 27న ప్రకటించింది. 2019 అక్టోబర్ వరకు ఉన్న కమిషన్ పదవీ కాలాన్ని తొలుత 2019 నవంబర్ 30 వరకు పొడిగించారు. అనంతరం దీనిని మరోమారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నులు, ఇతర వనరుల విభజనపై ఫైనాన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి నివేదికను అందించేందుకు విధించిన గడువును 2020 అక్టోబర్ 30 వరకు కేబినెట్ పొడిగించింది. ఇక 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం తుది నివేదికలో పొందుపరచాలని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
15వ ఆర్థిక సంఘం పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 28 Nov 2019 05:58PM

Photo Stories