10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో రజతం సాధించిన భారతీయ అథ్లెట్?
కెన్యా రాజధాని నైరోబిలో ఆగస్టు 21న జరిగిన పురుషుల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో 17 ఏళ్ల ఖత్రీ పోటీని 42 నిమిషాల 17.94 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన హెరిస్టోన్ వాన్యోని 42 ని.10.84 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకం సాధించగా, స్పెయిన్ అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ (42ని.26.11 సె.) కాంస్యం గెలుపొందాడు. పాల్గొన్న తొలి అంతర్జాతీయ పోటీలో రజతం గెలిచిన తన శిష్యుడు ఖత్రీ ప్రదర్శన పట్ల కోచ్ చందన్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
ది హండ్రెడ్ టోర్ని టైటిల్ను గెలుచుకున్న జట్టు?
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తొలిసారి నిర్వహించిన ‘ది హండ్రెడ్’ టోర్నీ మహిళల టైటిల్‌ను ఓవల్ ఇన్‌విన్సిబుల్స్ జట్టు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో ఆగస్టు 21న జరిగిన ఫైనల్లో ఓవల్ 48 పరుగుల తేడాతో సదరన్ బ్రేవ్‌పై ఘన విజయం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ జూనియర్ (అండర్–20) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో రజతం సాధించిన భారతీయ అథ్లెట్?
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : భారత అథ్లెట్ అమిత్ ఖత్రీ
ఎక్కడ : నైరోబి, కెన్యా