Skip to main content

Nitish Kumar Resigns As CM Of Bihar : ముఖ్య‌మంత్రి పదవికి నితీష్‌ రాజీనామా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు..

బీహార్‌ పాలిటిక్స్‌లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్‌ కుమార్‌ బీహార్ ముఖ్య‌మంత్రి పదవికి ఆగ‌స్టు 9వ తేదీన (మంగళవారం) రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.

అయితే, ఆర్జేడీతో కలిసి నితీష్‌ కుమార్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌..
కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్‌ కుమారే ఉండనున్నట్టు సమాచారం. ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా.. ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

రాజీనామా అనంతరం నితీష్‌ కుమార్‌ మీడియాతో​ మాట్లాడుతూ.. సీఎం పదవికి రాజీనామా చేశాను. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాము. జేడీయూను విడదీసేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెలిపారు. 

ఇక.. నితీష్‌ కుమార్‌ రాజీనామా చేసిన అనంతరం.. పాట్నాలోని రాబ్రీ దేవి ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఈ ‍క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

రెండేళ్లకే ఈ కూటమి బంధం

RJD


ఆర్జేడీతో కలిసి నీతీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తేజస్వీకి మళ్లీ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు హోం శాఖను కూడా కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు. అయితే వీరి రెండేళ్లకే ఈ కూటమి బంధం తెగిపోయింది. 2017లో ఆర్జేడీ- కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న నీతీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీ(యు)- భాజపా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేడీ(యు) పార్టీకి తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వానికి నీతీశ్‌ సారథ్యం వహించారు.

Published date : 09 Aug 2022 04:46PM

Photo Stories