BCCI Breaking News : బీసీసీఐ సెలక్షన్ కమిటీ రద్దుకు.. కారణాలివే..! భారత క్రికెట్ చరిత్రలో..
నేపథ్యంలో.. ఒక్కసారిగా యావత్ భారత క్రికెట్ కుదుపుకు లోనైంది. భారత క్రికెట్ చరిత్రలో జాతీయ సెలక్షన్ కమిటీని ఇలా హఠాత్తుగా తొలగించిన దాఖలాలు లేకపోవడంతో సర్వత్రా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంపై అంతార్జతీయ క్రికెట్ సర్కిల్స్‌లో సైతం చర్చ జోరుగా సాగుతుంది. ఇంత ఆదరాబాదరాగా సెలెక్షన్ ప్యానెల్‌పై ఎందుకు వేటు వేయాల్సి వచ్చిందోనని నెటిజన్లు ఆరా తీసే పనిలో పడ్డారు. అయితే సెలెక్షన్ కమిటీపై వేటుకు గట్టి కారణాలే ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
BCCI : బీసీసీఐ సెలక్షన్ కమిటీ రద్దు.. నూతన సెలక్టర్ల కమిటీ కోసం..
నాటి నుంచి నేటి వరకు అన్ని..
2021 జనవరిలో చేతన్ శర్మ నేతృత్వంలో సునీల్ జోషి(సౌత్ జోన్), హర్విందర్ సింగ్(సెంట్రల్ జోన్), దెబాషిశ్ మొహంతి(ఈస్ట్ జోన్)లతో కూడిన జాతీయ సెలెక్షన్ కమిటీ ఎన్నికైంది. నాటి నుంచి కమిటీ తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా, నాసిరకంగా ఉన్నాయని బీసీసీఐ వివరణ ఇచ్చింది.
వీరి హయాంలో టీమిండియా..
☛ 2021 టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం నాకౌట్ స్టేజ్‌కు కూడా చేరలేదు
☛ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి
☛ ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్-4లోనే పరాభవం
☛ తాజాగా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమణ
☛ బుమ్రా, జడేజా పూర్తి ఫిట్‌గా లేకపోయినా ఎంపిక చేయడం
☛ ఏడాదికి 8 మంది కెప్టెన్లను మార్చడం
☛ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ఎంపిక చేసిన జట్లలో సమతూకం లోపించడం
ఇలా పై పేర్కొన్న అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ చేతన్ శర్మ టీమ్‌కు ఉద్వాసన పలికినట్లు వివరణ ఇచ్చింది.
T20 World Cup 2022 : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు ఇవే.. ఈ ఇద్దరి వల్లనే..