Bilateral Summit: భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు ఏ దేశంలో సమావేశం కానున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021, డిసెంబర్ 6వ తేదీన భారత్‌కు రానున్నారు. అదే రోజు ఆయన ప్రధాని నరేద్ర మోదీతో సమావేశం అవుతారని నవంబర్ 26న భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇద్దరు నేతలు ఏడాదికోసారి సమావేశమై రెండు దేశాల నడుమ కొనసాగుతున్న అన్ని రకాల సంబంధాలపై సమీక్ష జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య 21వ వార్షిక శిఖరాగ్ర భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. కొవిడ్-19 కారణంగా 2020 ఏడాది భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు వాయిదా పడింది. ఇంతవరకు ఇలాంటివి 20 సదస్సులు జరిగాయి. ఒకసారి భారత్‌లోను, మరోసారి రష్యాలోనూ వీటిని నిర్వహిస్తున్నారు.
2+2 చర్చలు కూడా...
డిసెంబర్ 6వ తేదీనే రెండు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల మధ్య 2+2 చర్చలు కూడా జరగనున్నాయి. భారత్ ఇలాంటి ‘2+2’ మంత్రుల భేటీలను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా అతికొద్ది దేశాలతోనే నిర్వహిస్తోంది.
చదవండి: భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోన్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, డిసెంబర్ 6న భారత ప్రధాని నరేద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2
ఎక్కడ : భారత్
ఎందుకు : ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఉమ్మడి ప్రయోజనకరమైన వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపేందుకు..
డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.
యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్