Skip to main content

S-400 Missile System: భారత్‌కు ఎస్‌–400 ట్రయంఫ్‌ మిస్సైల్స్‌ను సరఫరా చేస్తోన్న దేశం?

s-400

ఒకవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంపై కొనసాగిస్తున్న రష్యా మరోవైపు ఒప్పందం ప్రకారం భారత్‌కు ఎస్‌–400 ట్రయంఫ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సరఫరాను ప్రారంభించింది. ఈ వ్యవస్థకు సంబంధించి సెకండ్‌ రెజిమెంట్‌ కొన్ని భాగాలు భారత్‌కు చేరుకోవడం మొదలయ్యిందని అధికార వర్గాలు ఏప్రిల్‌ 15న వెల్లడించాయి. మరికొన్ని కీలక విడిభాగాలు రావాల్సి ఉందని తెలిపాయి. ఈ క్షిపణి వ్యవస్థకు చెందిన మొదటి రెజిమెంట్‌ భాగాలను రష్యా 2021, డిసెంబర్‌లో సరఫరా చేసింది. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్‌–400 క్షిపణులు భారత్‌కు అండగా నిలవనున్నాయి.

Economic Crisis in Sri Lanka: శ్రీలంకకు 40 వేల టన్నుల డీజిల్‌ సరఫరా చేసిన దేశం?

ఆకాశంలోకి..
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్‌–400 ట్రయంఫ్‌ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను (దాదాపు రూ.35 వేల కోట్లను పైగా వెచ్చించి) కొనుగోలు చేయాలని భారత్‌ 2015లో నిర్ణయించింది. ఈ మేరకు 2018లో ఆ దేశంతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. దీనిపై అప్పట్లో అమెరికా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ భారత్‌ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. 2021 చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.

ఎస్‌–400 ప్రత్యేకతలు..

  • శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్‌–400 ట్రయంఫ్‌ వాటిని గుర్తించి నాశనం చేయగలదు.
  • ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు.
  • ఎస్‌–300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్‌–400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు.
  • భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు.
  • వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.

PM Modi, PM Deuba: జయనగర్‌–కుర్తా రైల్వే లైన్‌ను ఏ రెండు దేశాల మధ్య ప్రారంభించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
భారత్‌కు ఎస్‌–400 క్షిపణి వ్యవస్థను సరఫరా చేస్తోన్న దేశం?
ఎప్పుడు  : ఏప్రిల్‌ 15
ఎవరు    : రష్యా 
ఎందుకు : 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్‌–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్‌ ఒప్పందం చేసుకున్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Apr 2022 03:56PM

Photo Stories