ఫిబ్రవరి 2020 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
చదవండి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన
భారత్‌లో యూఏఈ కోర్టుల తీర్పుల అమలు
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫెడరల్, లోకల్ కోర్టులు జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్ల ఉత్తర్వుల అమలుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 21న వెల్లడించింది. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్-1908లోని 44ఎ కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి యూఏఈని రెసిప్రొకేటింగ్ టెరిటరీగా (పరస్పర సహకార పూర్వక భూభాగం)గా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. యూఏఈ పరిధిలోని రెండు ఫెడరల్ కోర్టులు, అయిదు లోకల్ కోర్టులను ఆ ప్రాంత ఉన్నత న్యాయ స్థానాలుగా గుర్తించింది. అవి జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్లను దేశంలో అమలు చేయనుంది. ఏదైనా డబ్బు చెల్లింపు, పన్ను బకాయిలు, జరిమానాలు, డబ్బుతో ముడిపడిన ఇతర అంశాలకు సంబంధించిన డిక్రీ, తీర్పులు ఇందులో ఉంటాయి.
భారత ప్రభుత్వం అంగీకరించిన కోర్టుల జాబితా
ఫెడరల్ కోర్టులు:
భారత్‌లో యూఏఈ కోర్టుల తీర్పుల అమలు
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫెడరల్, లోకల్ కోర్టులు జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్ల ఉత్తర్వుల అమలుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ ఫిబ్రవరి 21న వెల్లడించింది. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్-1908లోని 44ఎ కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి యూఏఈని రెసిప్రొకేటింగ్ టెరిటరీగా (పరస్పర సహకార పూర్వక భూభాగం)గా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. యూఏఈ పరిధిలోని రెండు ఫెడరల్ కోర్టులు, అయిదు లోకల్ కోర్టులను ఆ ప్రాంత ఉన్నత న్యాయ స్థానాలుగా గుర్తించింది. అవి జారీ చేసే డిక్రీలు, జడ్జిమెంట్లను దేశంలో అమలు చేయనుంది. ఏదైనా డబ్బు చెల్లింపు, పన్ను బకాయిలు, జరిమానాలు, డబ్బుతో ముడిపడిన ఇతర అంశాలకు సంబంధించిన డిక్రీ, తీర్పులు ఇందులో ఉంటాయి.
భారత ప్రభుత్వం అంగీకరించిన కోర్టుల జాబితా
ఫెడరల్ కోర్టులు:
- ఫెడరల్ సుప్రీం కోర్టు
- ఫెడరల్, ఫస్ట్ ఇన్‌స్టెన్స్ అండ్ అప్పీల్ కోర్ట్స్ ఇన్ ద ఎమిరేట్స్ ఆఫ్ అబుధాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వాయిన్ అండ్ ఫుజైరా
- అబుధాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్
- దుబాయి కోర్టులు
- రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ డిపార్ట్మెంట్
- కోర్ట్స్ ఆఫ్ అబుధాబీ గ్లోబల్ మార్కెట్స్
- కోర్ట్స్ ఆఫ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్
భారత్‌తో వాణిజ్యంలో అమెరికాకు అగ్రస్థానం
భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో చైనాను వెనక్కి నెట్టేసి అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం... 2018-19లో అమెరికాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.95 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందింది. అదే ఏడాది చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 87.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2019-20లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నా.. అమెరికా-భారత్ మధ్య 68 బిలియన్ డాలర్ల వాణిజ్య లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇదే కాలంలో చైనాతో వాణిజ్యం 64.96 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018-19లో అమెరికాతో మన దేశానికి వాణిజ్య మిగులు 16.85 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనాతో 53.56 బిలియన్ డాలర్ల లోటు ఉంది.
సుప్రీంకోర్టులో బ్రిటన్ అత్యున్నత న్యాయమూర్తి
బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ ఫిబ్రవరి 24న భారత సుప్రీంకోర్టులో విచారణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అంతర్జాతీయ న్యాయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన లార్డ్ జాన్ రీడ్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేతోపాటు 15 నిమిషాలపాటు ధర్మాసనంపై కూర్చొని కోర్టు వ్యవహారాలను పరిశీలించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆయన్ను కోర్టు హాల్లోకి ఆహ్వానించారు.
మానవ హక్కులపై దాడులు: ఐరాస
ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులపై దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని ఆపేందుకు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీలతోపాటు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు.
వుహాన్ ప్రాంతానికి 15 టన్నుల భారత్ మందులు
కోవిడ్-19 వైరస్ ప్రభావిత ప్రాంతమైన చైనాలోని వుహాన్ ప్రాంతానికి భారత్ సుమారు 15 టన్నుల మందులను పంపింది. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన విమానంలో ఫిబ్రవరి 26న ఈ మందులను తరలించారు. విమానంలో మాస్కులు, గ్లోవ్స, ఇతర అత్యవసర వైద్య పరికరాలను పంపిస్తున్నట్లు భారత్ తెలిపింది. ఐఏఎఫ్ విమానం భారత్‌కు తిరిగొస్తూ చైనాలో ఉన్న భారతీయులను తీసుకురానుంది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు ఫిబ్రవరి 26న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 25న 52 మంది కోవిడ్-19 (కరోనా వైరస్)కారణంగా మరణించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 2715కు చేరుకోగా, వ్యాధితో ఉన్న వారి సంఖ్య 78,064కు చేరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వుహాన్ ప్రాంతానికి 15 టన్నుల మందులు
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : భారత్
ఎందుకు : కోవిడ్-19 వైరస్ బాధితుల కోసం
భారత్-పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు
పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు భారత్, పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా న్యూఢిల్లీలో ఫిబ్రవరి 14న భేటీ అయిన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పోర్చుగీసు అధ్యక్షుడు డిసౌసా భారత్‌కు వచ్చారు. పోర్చుగీసు అధ్యక్షుడిగా డిసౌసా భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా పోర్చుగీస్ అధ్యక్షుడు భారత్‌ను 2007లో సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్-పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగీసు అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌసా
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పెట్టుబడులు, రవాణా, ఓడరేవులు, కర్మాగారాలు, మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు
నమస్తే ట్రంప్ పేరుతో మోదీ, ట్రంప్ కార్యక్రమం
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతెరా(అహ్మదాబాద్)లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టే తొలి కార్యక్రమం ‘కెమ్ ఛో ట్రంప్’ పేరును ‘నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం ఫిబ్రవరి 16న నిర్ణయించింది. ఇంగ్లిష్‌లో హౌ డూ యూడూ అనే అర్థం వచ్చేలా గుజరాతీ భాషలో కెమ్ ఛో (ఎలా ఉన్నారు? ట్రంప్) అని పేరు పెట్టారు. కానీ అది స్థానిక భాషలో ఉండడంతో ఒక ప్రాంతానికి పరిమితమైనట్టుగా ఉంది. అగ్రరాజ్యాధిపతి పాల్గొనే ఆ కార్యక్రమానికి జాతీయ భావాన్ని తలపించడం కోసం కేంద్రం ఆదేశాల మేరకు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ అని మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. 2019 ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ‘నమస్తే ట్రంప్’ జరగనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నమస్తే ట్రంప్ పేరుతో మోదీ, ట్రంప్ కార్యక్రమం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : గుజరాత్ ప్రభుత్వం
ఎక్కడ : మోతెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్
ప్రధాని మోదీతో శ్రీలంక ప్రధాని రాజపక్స భేటీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 8న జరిగిన ఈ సమావేశంలో శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విసృ్త్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని రాజపక్సను మోదీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఉగ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు
భారత్‌కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ
భారత్‌కు అత్యంత అధునాతనమైన గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా సరఫరా చేయనుంది. ఈ మేరకు 186 కోట్ల డాలర్ల విలువైన ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ’ (ఐఏడీడబ్ల్యూఎస్) విక్రయానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ఐఏడీడబ్ల్యూఎస్‌ను విక్రయించాలని అమెరికాను భారత్ కోరినట్లు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. ఐఏడీడబ్ల్యూఎస్ విక్రయంలో భాగంగా ఏఎన్/ఎంపీక్యూ-64ఎఫ్ఐ సెంటినెల్ రాడార్ వ్యవస్థ, 118 ఆమ్రామ్ ఏఐఎం-120సి-7/సి-8 క్షిపణులు, 3 ఆమ్రామ్ మార్గనిర్దేశ వ్యవస్థలు, 134 స్టింగర్ క్షిపణులు, ఇతర అధునాతన సెన్సర్లు, సాధనాలు, లాంచర్లు భారత్‌కు అందుతాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ విక్రయం
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : అమెరికా
భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన ఖరారు
భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన తేదీలు ఖరారయ్యాయి. 2020 ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో భారత్ రానున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, అమెరికా ప్రభుత్వం ఫిబ్రవరి 11న వెల్లడించాయి. భారత్‌లో ట్రంప్ మొదటిసారిగా జరిపే ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను, ప్రజల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతాయని అమెరికా తెలిపింది. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా ఉంటారని పేర్కొంది.
ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ట్రంప్, భారత ప్రధాని మోదీ ద్వెపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విసృ్తతం చేసుకునేందుకు కృషి చేస్తారని భారత్ తెలిపింది. ట్రంప్ కంటే ముందు 2010-2015 సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా భారత్‌లో పర్యటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో అమెరికా అధ్యక్షుడి పర్యటన
ఎప్పుడు : 2020 ఫిబ్రవరి 24, 25
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎక్కడ : న్యూఢిల్లీ, అహ్మదాబాద్
ఎందుకు : ద్వెపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విసృ్తతం చేసుకునేందుకు
చైనా ప్రయాణికులకు భారత్ ఇ-వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ-వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని(కరోనా వైరస్ వ్యాప్తి) దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2న ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
చైనాలో బర్డ్ ఫ్లూ భయం
కరోనా వైరస్‌తోనే నానాయాతన పడుతున్న చైనాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాధి బయల్పడింది. హుబాయ్ ప్రావిన్స్ కు దక్షిణ సరిహద్దుల్లో హువాన్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి బయటకి వచ్చింది. షోయాంగ్ నగరంలోని పౌల్ట్రీలో ఈ వైరస్ బయటపడినట్టు చైనా వ్యవసాయం, గ్రామీణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్కడ 7,850 కోళ్లు ఉంటే, 4,500 కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయి. మరో 17,828 కోళ్లను వ్యవసాయాధికారులే చంపేశారు. ఇప్పటికింకా మనుషులకు ఈ వ్యాధి సోకలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా ప్రయాణికులకు ఇ-వీసా రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : భారత్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
Published date : 01 Mar 2020 03:01PM