Operation Ganga: ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు
ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిణామాలు, ముఖ్యంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల తరలింపే ఎజెండాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 28న అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు... కేంద్రమంత్రులు స్వయంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి తరలింపు ప్రక్రియను పర్యవేక్షించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు. వీళ్లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియాలకు వెళ్తారు. అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ.. భారతీయుల తరలింపును వేగవంతం చేస్తారు. ఆపరేషన్ గంగ పేరుతో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను కేంద్రం చేపట్టింది.
Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య మొదలైన యుద్ధం.. అసలు ఈ యుద్ధం ఎందుకు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు హంగేరి, రొమేనియా, పోల్యాండ్, స్లొవేకియాలకు వెళ్లనున్న కేంద్రం మంత్రులు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, జనరల్(రిటైర్డ్) వీకే సింగ్
ఎందుకు : ఆపరేషన్ గంగలో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్