ఏప్రిల్ 2018 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
బ్రిటన్-ఇండియా టెక్ అలయన్స్ ఏర్పాటు
భారత్, బ్రిటన్‌ల మధ్య టెక్నాలజీ సంబంధాలు పటిష్టం చేసుకునే దిశగా టెక్‌యూకే, దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ బ్రిటన్-ఇండియా టెక్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఏప్రిల్ 18న ఇరు దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ ఒప్పందంతో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, కొత్త టెక్నాలజీలు పరస్పరం మార్చుకోవడంతో పాటు విధానాల రూపకల్పనలో సహకారం సులభం అవుతుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబయాని ఘోష్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్-ఇండియా టెక్ అలయన్స్ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : టెక్‌యూకే, నాస్కామ్
ఎందుకు : కొత్త టెక్నాలజీలు పరస్పరం మార్చుకోవడం కోసం
ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన
కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సు కోసం ప్రదాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 18న బ్రిటన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రదాని థెరిసా మేతో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో నేరస్తుల అప్పగింత, న్యాయపరమైన, రక్షణ, భద్రతాపరమైన అంశాలు, పరస్పర మిలటరీ సహకారంతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆన్‌లైన్ ఉగ్రవాదం తదితర అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మోదీ పర్యటన సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-యూకే వాణిజ్య భాగస్వామ్య పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో బ్రిటన్‌లో భారత్ పెట్టే బిలియన్ పౌండ్ల (రూ.9,340 కోట్లు) పెట్టుబడితో 5,750 కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
పర్యటనలో భాగంగా మోదీ లండన్‌లోని సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్ లో ‘భారత్ కీ బాత్.. సబ్ కే సాథ్’ పేరుతో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 1912లో ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ హాల్‌లో మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, బౌద్ధమత గురువు దలైలామా, యువరాణి డయానా వంటి ప్రముఖులు ప్రసంగించారు. 1946లో ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సర్వసభ్య సమావేశం జరిగింది కూడా సెంట్రల్‌హాల్ వెస్ట్‌మినిస్టర్‌లోనే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎందుకు : కామన్వెల్త్ దేశాధినేతల (చోగమ్) సదస్సు కోసం
జర్మనీ ఛాన్సలర్‌తో మోదీ బేటీ
ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్‌తో ఏప్రిల్ 20న బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షి, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.
ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్న సుష్మా స్వరాజ్
చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ఏప్రిల్ 24న జరిగిన ఈ సదస్సుకు 8 సభ్యదేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి వాటిని నియంత్రించడంలో అన్ని దేశాలు కలసి పోరాడాలని సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. చైనా చేపట్టిన వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ) ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించగా మిగిలిన దేశాలు ఆమోదించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌సీవో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సు
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
ఎక్కడ : చైనా
ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి జర్మనీ మద్దతు
అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ సభ్యత్వం పొందడానికి సహకరిస్తామని జర్మనీ ప్రకటించింది. ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం భారత్ 2016లో దరఖాస్తు చేసుకోగా చైనాతో పాటు మరికొన్ని దేశాలు వ్యతిరేకించాయి. ఈ గ్రూపులో సభ్యత్వం పొందాలంటే భారత్ ఎన్‌పీటీపై సంతకం చేయాలి. భారత్‌తోపాటు ఇజ్రాయెల్, పాకిస్థాన్ దేశాలు ఇప్పటి వరకు ఎన్‌పీటీలో సంతకం చేయలేదు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీలో 48 దేశాలకు సభ్యత్వం ఉంది. భారత్‌కు ఇప్పటికే అణ్వస్త్రాల నిరోధానికి ఉద్దేశించిన క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ విధానం (ఎంటీసీఆర్)లో సభ్యత్వం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి మద్దతు
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : జర్మనీ
ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన
ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16న స్వీడన్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్‌తో జరిగిన సమావేశంలో రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం భారత్ - స్వీడన్‌లు సంయుక్తంగా నిర్వహించిన నోర్డిక్ దేశాల(ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, డెన్మార్, నార్వే) సదస్సులో మోదీ మాట్లాడారు. ఏప్రిల్ 19న బ్రిటన్‌లో జరిగే చోగమ్ (కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం)లో మోదీ పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎందుకు : ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడానికి
నేపాల్ ప్రధానితో మోదీ చర్చలు
భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 7న ఢిల్లీలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతం, రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చించారు. భారత భూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేపాల్, భారత ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : కేపీ శర్మ ఓలీ - నరేంద్ర మోదీ
ఎందుకు : కేపీ శర్మ ఓలీ భారత పర్యటనలో భాగంగా
భారత్-బంగ్లా మధ్య చమురు పైప్‌లైన్
భారత్‌లోని సిలిగురి, బంగ్లాదేశ్‌లోని పార్బతిపూర్ మధ్య 129.5 కిలోమీటర్ల చమురు(డీజిల్) పైప్‌లైన్ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు ఏప్రిల్ 9న ఢాకాలో సంతకాలు చేశాయి. దీంతో ఏటా పది లక్షల టన్నుల డీజల్ ఎగుమతికి మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా మరో ఆరు కీలక ఒప్పందాలపై భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే, బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ షాహిదుల్ సంతకాలు చేశారు. వీటిలో ప్రసారభారతి-బంగ్లాదేశ్ బేతార్ మధ్య సహకారం, ఢాకా విశ్వవిద్యాలయంలో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్) ఉర్దూ పీఠం ఏర్పాటు, బంగ్లాదేశ్‌లోని 500 పాఠశాలల్లో భాషాశాలల ఏర్పాటు, రంగ్‌పూర్ నగరంలో రహదారుల అభివృద్ధి తదితరాలు ఉన్నాయి.

Published date : 16 May 2018 03:32PM