ఆగస్టు 2020 ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
భారత్‌కు వంద అమెరికా వెంటిలేటర్లు
భారత్‌కు అమెరికా ఆగస్టు 19న 100 వెంటిలేటర్లను అందజేసింది. కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు సహాయపడతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు వీటిని అందజేసినట్లు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ తెలిపారు. జూన్ 14న తొలి విడతగా అమెరికా 100 వెంటిలేటర్లను పంపింది. ఆగస్టు 19న మరో వంద అందజేసింది. ట్రంప్ విన్నతి మేరకు అమెరికాకు పెద్ద ఎత్తున హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను భారత్ పంపిన విషయం తెలిసిందే.
అందుబాటులోకి అవిగన్ ట్యాబ్లెట్స్
ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోవిడ్–19 చికిత్సలో వాడే అవిగన్ (ఫావిపిరావిర్) 200 ఎంజీ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో అవిగన్ ట్యాబ్లెట్స్ తయారీ, విక్రయం, పంపిణీకి జపాన్ కు చెందిన ఫ్యూజిఫిల్మ్ టొయామా కెమికల్స్ నుంచి ప్రత్యేక హక్కులను రెడ్డీస్ ల్యాబ్స్ ఇటీవల దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత్‌కు వంద వెంటిలేటర్లు అందజేత
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: అమెరికా
ఎందుకు :కోవిడ్–19ను ఎదుర్కొనేందుకు
వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌తో పనిచేస్తాం: రష్యా
కోవిడ్ –19ను ఎదుర్కొనేందుకు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్-5 ఉత్పత్తి కోసం భారత్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈఓ కిరిల్ దిమిత్రివ్ చెప్పారు. స్పుత్నిక్ టీకానుఈర్‌డీఐఎఫ్‌తో కలిసి గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ ను సమర్ధవంతంగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారత్‌కు ఉంది. ప్రస్తుత డిమాండ్ తట్టుకోవాలంటే ఇలాంటి భాగస్వామ్యాలు అవసరం అని ఆగస్టు 20న కిరిల్ తెలిపారు.
2020 ఏడాది చివరికి వ్యాక్సిన్: హర్షవర్థన్
2020 ఏడాది చివరి నాటికి దేశంలో కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో రెండు భారత్‌కు చెందిన సంస్థలు తయారు చేస్తుండగా, ఇంకోటి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తోంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా టీకా ప్రయోగాలు మొదటి దశ మానవ ప్రయోగాలను ముగించుకొని, రెండో దశలోకి ప్రవేశించాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ టీకా రెండు, మూడు దశల మానవ ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్‌తో పనిచేస్తాం
ఎప్పుడు: ఆగస్టు 20
ఎవరు: రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)
ఎందుకు:స్తుత డిమాండ్ తట్టుకోవాలంటే ఇలాంటి భాగస్వామ్యాలు అవసరం అని
అభివృద్ధిపై భారత్, నేపాల్ సమీక్ష
భారత ఆర్థిక సాయంతో నేపాల్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఇరుదేశాల దౌత్యవేత్తలు ఆగస్టు 17న ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శంకర్ దాస్ బైరాగి, భారత దౌత్యవేత్త వినయ్ మోహన్ క్వాత్రాల నేతృత్వంలో ఈ సమావేశాలు జరిగాయి. భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాలను తమవిగా ప్రకటించి నేపాల్ కొత్త మ్యాపులు సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దుల వివాదం మొదలైన తరువాత ఈ స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.
భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్‌తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. సరిహద్దుల విషయంలో పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావోలిజియన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: నేపాల్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శంకర్ దాస్ బైరాగి, భారత దౌత్యవేత్త వినయ్ మోహన్ క్వాత్రా

మారిషస్ కోర్టు భవన ప్రారంభోత్సవంలో మోదీ
మారిషస్ రాజధాని పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని జూలై 30న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్లైన్విధానంలో ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని స్పష్టం చేశారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
భారత్ భాగస్వామ్యం...
అఫ్గానిస్తాన్పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలో భారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనం ప్రారంభం
ఎప్పుడు: జూలై 30
ఎవరు : భారత ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని జగన్నాథ్
ఎక్కడ : పోర్ట్ లూయీస్, మారిషస్
పాకిస్తాన్ నూతన మ్యాప్ ఆవిష్కరణ
నేపాల్ తరహాలోనే తరహాలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త మ్యాప్ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఆగస్టు 5 నాటికి ఏడాది కానుంది. అంతకంటే ఒక్కరోజు ముందు ఆగస్టు 4న పాక్ నూతన మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్‌నకు పాక్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చారు. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించారు. సియాచిన్ ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేశారు.
పాక్ చర్య హాస్యాస్పదం
కొత్త మ్యాప్ అంటూ పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పాకిస్తాన్ నూతన మ్యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు: ఆగస్టు 4
ఎవరు: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

Published date : 01 Sep 2020 12:04PM