Awarded: యాదాద్రి ఆలయానికి ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ పురస్కారం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 2022 – 2025 సంవత్సరాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంస్థ ప్రదానం చేసే ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డు లభించింది.
ప్రధానాలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో పునఃనిర్మించడంతో పాటు కొండ చుట్టూ ఆకుపచ్చగా తీర్చిదిద్దడం, నీటిశుద్ధి నిర్వహణ, ఆలయ అభివృద్ధిలో నిబంధనలు, పరిరక్షణకు పలు చర్యలు పాటించడాన్ని పరిగణనలోకి తీసుకొని యాదాద్రి క్షేత్రానికి ఈ అవార్డును ప్రకటించారని వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు అక్టోబర్ 20నఒక ప్రకటనలో తెలిపారు.
Also read: Booker Prize : శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Oct 2022 07:01PM