UN World Tourism Awards: భారత్ తరఫున బెస్ట్ విలేజ్ పోటీలో నిలిచిన గ్రామం?
భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది.
భూదానోద్యమానికి అంకురార్పణ...
కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయమైన భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది.
సిల్క్‌సిటీగా పేరు...
భూదాన్‌పోచంపల్లి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది.
చదవండి: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో నిలిచిన హైదరాబాదీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ తరఫున ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీలో నిలిచిన గ్రామలు?
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : భూదాన్‌పోచంపల్లి(తెలంగాణ), కాంగ్‌థాన్(మేఘాలయ), లద్‌పురాఖాస్(మధ్యప్రదేశ్)
ఎందుకు : ఘనమైన చరిత్ర కలిగి ఉండటం, కుటీర పరిశ్రమలు, వ్యవసాయంతోపాటు మరిన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందున...