Skip to main content

మే 2021 అవార్డ్స్

ప్రపంచంలోనే అతి పెద్ద కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పోటీ?
ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిర్వహించిన తొమ్మిదో కోడ్‌వీటా కాంపిటీషన్‌. ప్రపంచంలోనే అతి పెద్ద కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పోటీగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 34 దేశాల నుంచి 1,36,054 మంది ఇందులో పాల్గొన్నారు. దాదాపు ఆరు గంటల కాంపిటీషన్‌లో ఇచ్చిన సవాళ్లను పరిష్కరించేందుకు కాలేజీ విద్యార్థులు తమ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పోటీపడినట్లు టీసీఎస్‌ మే 24న తెలిపింది. పోటీలో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన స్టీవెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విద్యార్థి బెన్‌ అలెగ్జాండర్‌ మిర్చోక్‌ విజేతగా నిల్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతి పెద్ద కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ పోటీగా గిన్నిస్‌ రికార్డు
ఎప్పుడు : మే 24
ఎవరు : టీసీఎస్‌ నిర్వహించిన తొమ్మిదో కోడ్‌వీటా కాంపిటీషన్‌
ఎక్కడ : ప్రపంచంలోనే

షిండ్లర్ పురస్కారం అందుకున్నమొదటి భారతీయుడు?
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి.. ప్రతిష్టాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) వారి అత్యున్నత క్రిస్టల్‌ అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ట్రో స్కోపీ పితామహుడిగా పేరుపొందిన రుడాల్ఫ్‌ వి.షిండ్లర్‌ అవార్డును క్రిస్టల్‌ అవార్డ్స్‌లో అత్యున్నత కేటగిరీగా పరిగణిస్తారు. షిండ్లర్ పేరిట ఇచ్చిన పురస్కారానికి ఎంపికైన మొదటి భారతీయుడిగా నాగేశ్వర్రెడ్డి అరుదైన ఘనత సాధించారు. మే 24న ఏఎస్‌జీఈ అధ్యక్షుడు డాక్టర్‌ క్లాస్‌ మెర్జెనర్‌ వర్చువల్‌ కార్యక్రమంలో నాగేశ్వర్‌రెడ్డికి ఈ అవార్డును అందజేశారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. భారత దేశంలో ఎండోస్కోపీకి ఆదరణ కల్పించి, విస్తృతికి కారణమైన వారిలో నాగేశ్వర్‌రెడ్డి ఒకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రుడాల్ఫ్‌ వి.షిండ్లర్‌ పురస్కారం అందుకున్న మొదటి భారతీయుడు?
ఎప్పుడు : మే 24
ఎవరు : ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి
ఎక్కడ : వర్చువల్‌ కార్యక్రమం ద్వారా..
ఎందుకు : గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ ఎండోస్కోపీ రంగంలో పరిశోధన, శిక్షణ, సేవలలో భాగస్వామ్యానికిగాను

ఎన్టీఆర్ సాహిత్య పురస్కారానికి ఎంపికైన సాహితీ వేత్త?
ప్రముఖ రచయిత, సాహితీ వేత్త, ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడిని ఎన్టీఆర్‌ సాహిత్య పురస్కారం-2021 వరించింది. ఈ విషయాన్ని ఎన్‌టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ సంచాలకురాలు డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి మే 26న ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. మే 29 వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్... ఈ పురస్కారాన్ని చినవీరభద్రుడికి ప్రదానం చేస్తారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు పేరిట ఈ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఏడాదికిగాను ఎన్టీఆర్‌ సాహిత్య పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : మే 26
ఎవరు : వాడ్రేవు చినవీరభద్రుడు
ఎందుకు : సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు...

ఇంటర్నేషనల్ ఎనీ అవార్డుకు ఎంపికైన భారతరత్నఅవార్డీ?
భారతరత్న ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలకు గాను ఆయన ఇంటర్నేషనల్ ఎనీ అవార్డు2020కు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అక్టోబరు 14న రోమ్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందించనున్నారు. పురస్కారంలో భాగంగా నగదుతోపాటు బంగారు పతకం ఇవ్వనున్నారు. ఎనర్జీ పరిశోధనలకు గాను ఇచ్చే ఈ పురస్కారాన్ని నోబెల్‌ బహుమతిగా పరిగణిస్తారు.

ఫుట్బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్కు వీడ్కోలు పలికిన కోచ్?
ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ రియల్‌ మాడ్రిడ్‌ కోచ్‌ పదవినుంచి దిగ్గజ ఆటగాడు జినెదిన్‌ జిదాన్‌ తప్పుకున్నాడు. కాంట్రాక్ట్‌ వచ్చే ఏడాది జూన్‌ వరకు ఉన్నా, ఇటీవల జట్టు ప్రదర్శనపై వచ్చిన విమర్శలతో అర్ధంతరంగానే తప్పుకున్నాడు. రెండుసార్లు కోచ్‌గా వ్యవహరించిన జిదాన్‌ రెండు పర్యాయాలు గడువులోపే వైదొలగడం గమనార్హం. తన శిక్షణలో మూడేళ్లు వరుసగా చాంపియన్స్‌ లీగ్‌ టైటిళ్లు సహా మొత్తం తొమ్మిది ట్రోఫీలను అందించడంలో జిదాన్‌ సఫలమయ్యాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్‌ ఎనీ అవార్డు–2020కు ఎంపిక
ఎప్పుడు : మే 27
ఎవరు : భారతరత్న ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు
ఎందుకు : పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనలకు గాను

మిస్‌ యూనివర్స్‌-2020 కిరీటాన్ని గెలుచుకున్న యువతి?
Current Affairs
2020 ఏడాదికి విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌) కిరీటాన్ని మెక్సికో యువతి ఆండ్రియా మెజా గెలిచారు. మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్‌ హార్డ్‌రాక్‌ హోటల్,క్యాసినోలో మే 16న విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతగా నిలిచిన 26 ఏళ్ల మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. మెజా తర్వాత స్థానంలో ఫస్ట్‌ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్‌ యువతి జూలియా గామా(28), సెకండ్‌ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి జనిక్‌ మాసెటా(27), మూడో రన్నరప్‌గా(నాలుగో స్థానంలో) భారతీయ యువతి, మిస్‌ ఇండియా అడ్‌లైన్‌ కాస్టెలినో(22) నిలిచారు.
మూడో మెక్సికన్‌గా...
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆండ్రియా మెజా... విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచారు. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ.. ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. ఆండ్రియా లింగ సమానత కోసం కూడా కృషి చేస్తున్నారు. కరోనా కారణంగా విశ్వసుందరి పోటీలను గతేడాది నిర్వహించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్‌ యూనివర్స్‌-2020 కిరీటాన్ని గెలుచుకున్న యువతి?
ఎప్పుడు : మే 16
ఎవరు : మెక్సికో యువతి ఆండ్రియా మెజా
ఎక్కడ : సెమినోల్‌ హార్డ్‌రాక్‌ హోటల్, హాలీవుడ్‌, అమెరికా
Published date : 29 Jun 2021 03:10PM

Photo Stories