Skip to main content

మే 2018 అవార్డ్స్

మన’ ప్రాజెక్ట్స్‌కు ఆసియా పసిఫిక్ అవార్డు
Current Affairs బెంగళూరుకు చెందిన మన ప్రాజెక్ట్స్ సంస్థకు ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ 2018-19 అవార్డు లభించింది. కంపెనీ చేపట్టిన ఉబర్ వర్ధంత్ ప్రాజెక్ట్‌కు ‘రెసిడెన్షియల్ హైరైజ్ ఆర్కిటెక్చర్, ఇండియా’ అవార్డు దక్కింది. అభివృద్ధి చెందిన ప్రాంతం, ఉత్తమమైన ఫ్లోర్ ప్లాన్, ఆధునిక వసతులు, తక్కువ కార్బన్ వినియోగం వంటి అంశాల కారణంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా పసిఫిక్ ప్రాపర్టీ 2018-19 అవార్డు
ఎప్పుడు : మే 25
ఎవరు : ‘మన’ ప్రాజెక్ట్స్

ఓగ్లా తొకర్‌జూకు మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్
పోలాండ్ రచయిత ఓగ్లా తొకర్‌జూ రాసిన ‘ఫ్లైట్స్’ అనే అనువాద నవలకు ఈ ఏడాది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ బహుమతి కింద వచ్చే 67 వేల డాలర్ల ప్రైజ్ మనీని ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రోఫ్ట్‌తో కలిసి పంచుకుంటారు. ఇదే నవలకు గాను ఓగ్లాకు 2008లో పోలాండ్ అత్యున్నత సాహిత్య పురస్కారమైన ‘నైక్’ అవార్డు కూడా దక్కింది.

శ్రీదేవికి టైటాన్’ పురస్కారం
Current Affairs
ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘టైటాన్ రెజినాల్డ్ ఎఫ్ లెవిస్ ఫిల్మ్ ఐకన్’ పురస్కారాన్ని ప్రముఖ నటి శ్రీదేవికి ప్రకటించారు. శ్రీదేవి మరణానంతరం లభించిన ఈ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సుభాష్ ఘయ్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘టైటాన్’ పురస్కారం 2018
ఎప్పుడు : మే 18
ఎవరు : శ్రీదేవి
ఎక్కడ : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్

డాక్టర్ గురురెడ్డికి బిజినెస్ లీడర్ పురస్కారం
కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురు ఎన్ రెడ్డిని యూకే అండ్ ఆసియా ఇన్‌స్పిరేషన్ బిజినెస్ లీడర్ అవార్డు వరించింది. వైద్య రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. యూకే అసెంబ్లీ హాల్‌లో మే 18న జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ హైకమిషనర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గత ఐదేళ్లలో గురు రెడ్డికి రెండు జీవితకాల సాఫల్య పురస్కారాలు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిజినెస్ లీడర్ పురస్కారం 2018
ఎప్పుడు : మే 18
ఎవరు : డాక్టర్ గురు ఎన్ రెడ్డి
ఎందుకు : వైద్య రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా

భారత్ బయోటెక్‌కు జాతీయ అవార్డు
Current Affairs దేశీయ సంస్థ భారత్ బయోటెక్ కు జాతీయ సామాజిక ఆవిష్కరణ అవార్డు 2017 లభించింది. అతిసార వ్యాధి నిర్మూలనకు రోటావాక్ వ్యాక్సిన్‌ను రూపొందించినందుకుగాను ఈ అవార్డు దక్కింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త నన్నం తిరుపతిరావును జాతీయ ఇన్నొవేషన్ అవార్డు వరించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు, పిల్లర్లను సులభంగా ఎక్కేందుకు రూపొందించిన పోల్ క్లింబర్, ట్రీ క్లింబర్ పరికరాలకుగాను ఈ పురస్కారం దక్కింది.
ఈ మేరకు 20వ సాంకేతికత దినోత్సవాన్ని (టెక్నాలజీ డే) పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీలో మే 11న ఆవిష్కకర్తలకు ఇన్నొవేషన్ అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ ఈ పురస్కరాలను ప్రదానం చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ సామాజిక ఆవిష్కరణ అవార్డు 2017
ఎప్పుడు : మే 11
ఎవరు : భారత్ బయోటెక్ సంస్థ, తిరుపతిరావు
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : నూతన ఆవిష్కరణలు చేసినందుకు

ఇండియా అవార్డ్స్-2018
వాణిజ్య ప్రకటనలకు ఇచ్చే ఇండియా అవార్డ్స్ 2018 ని హైదారాబాద్‌లో మే 11న ప్రదానం చేశారు. సాక్షి మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ సౌజన్యంతో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 23 విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు చెందిన వాణజ్య ప్రకటనలను పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు.
తొలిసారిగా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంస్థల వాణిజ్య ప్రకటనలకు రీజినల్ ఇండియా అవార్డ్స్‌ను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా అవార్డ్స్-2018
ఎప్పుడు : మే 11
ఎవరు : ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్
ఎక్కడ : హైదరాబాద్

ఫ్లో్లరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానంఅంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మే 12న రాష్ట్రపతిభవన్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 35 మందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానం చేశారు. నర్సులు అంకితభావంతో రోగులకు సేవలందిస్తున్నారని.. నర్సింగ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రపంచ సగటు గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమందికి 2.5 మంది నర్సులుండాలని, కానీ.. దేశంలో 1.7 మంది మాత్రమే ఉన్నట్లు తెలిపారు.

ఇండియన్ బ్యాంక్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు
Current Affairs ఇండియన్ బ్యాంక్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఏప్రిల్ 25న బిజినెస్ ఎక్స్‌లెన్స్ అండ్ ఇన్నోవేషన్ లీడర్‌షిప్‌పై దుబాయ్‌లో జరిగిన 28వ ప్రపంచ సదస్సు సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఏఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు-2018
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఇండియన్ బ్యాంక్
ఎక్కడ : దుబాయ్‌లో

యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు
ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కు సరస్వతి సమ్మాన్ అవార్డు 2017 లభించింది. ‘వాఖర్’ అనే కవితా సంకలనాన్ని రచించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన యశశ్చంద్ర 1941లో భుజ్‌లో జన్మించాడు. 2009 లో ప్రచురితమైన వాఖర్‌తో పాటు మరో రెండు కవితా సంకలనాలు, నాటకాలపై 10, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలను వెలువరించారు. సరస్వతీ సమ్మాన్ అవార్డును కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరస్వతి సమ్మాన్ అవార్డు 2017
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర
ఎందుకు : ‘వాఖర్’ అనే కవితా సంకలనానికి

సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) అవార్డ్స్ కమిటీ ఏప్రిల్ 28న సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించింది. పురుషుల విభాగంలో 2016-17 సంవత్సారానికి పంకజ్ రాయ్(మరణానంతరం), 2017-18 సంవత్సరానికి అన్షుమన్ గైక్వాడ్; మహిళల విభాగంలో 2016-17 సంవత్సరానికి డయానా ఎడుల్జీ, 2017-18 సంవత్సరానికి సుధా షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు.
Published date : 23 May 2018 03:35PM

Photo Stories