Indian Smart Cities Awards: కాకినాడకు ఇండియన్ స్మార్ట్ సిటీస్ అవార్డ్
Sakshi Education
ఇండియన్ స్మార్ట్ సిటీస్ అవార్డ్స్– 2022లో కాకినాడ స్మార్ట్‌సిటీ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
స్మార్ట్ సిటీస్ మిషన్, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ పోటీ విజేతలనుకేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ కూనల్ కుమార్ ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. ఇందులో పారిశుద్ధ్యం విభాగంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో కాకినాడకు ద్వితీయ స్థానం దక్కింది.
పారిశుద్ధ్యం విభాగంలో తొలిస్థానంలో ఇండోర్ మూడు, నాలుగు స్థానాల్లో అహ్మదాబాద్, చండీగఢ్ నిలిచాయి.
Devulapalli Ramanujarao Award 2023: దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం
Published date : 26 Aug 2023 01:37PM