Skip to main content

Gandhi Peace Prize: గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి–2021ను ప్రకటించారు.
Gandhi Peace Prize

ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు ఈ బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలియజేసింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు.

Modi to visit US: మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన.. పర్యాటన ఇలా..!

ఈ బహుమతిని 2020లో బంగ్లాదేశ్‌కు చెందిన బంగబంధు షేక్‌ ముజీబుర్‌ రెహ్మన్‌కు ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్‌ను 1923లో స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. 14 భాషల్లో 41.7 కోట్లకుపైగా పుస్తకాలను ప్రచురించింది. వీటిలో 16.21 కోట్ల భగవద్గీత గ్రంథాలు ఉన్నాయి. గీతా ప్రెస్‌కు అవార్డు రావడంపై ప్రధాని హర్షం వ్యక్తంచేశారు.

Prime Minister Narendra Modi: నరేంద్రమోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు

Published date : 19 Jun 2023 01:29PM

Photo Stories