CTET Key: బ్రేకింగ్...సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కీ విడుదల
ప్రతీ ఏడాది నిర్వహించే పరీక్షలకు లక్షల మంది అభ్యర్థులు హాజరవుతూ ఉంటారు.
వెయ్యి ఫీజుతో అభ్యంతరాలను....
సీబీఎస్ఈ తన అధికారిక వెబ్‌సైట్ http://www.ctet.nic.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు సైట్‌లోకి వెళ్లి కీని చూసుకోవచ్చు. అలాగే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫిబ్రవరి 17 వరకు కీ పై అభ్యంతరాలను తెలుపుకోవచ్చు. అభ్యంతరాలను కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినయ్యి తెలపాల్సి ఉంటుంది. ఈమెయిల్/పోస్ట్ లేదా వ్యక్తిగతంగా అభ్యంతరాలు చెప్పేందుకు వీలులేదు. అయితే ఒక్కో అభ్యంతరానికి రూ.1000 ఫీజుగా చెల్లించాలి. ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. వీటిని మాత్రమే సీబీఎస్ఈ పరిగణలోకి తీసుకుంటుంది.
చదవండి: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..
ఆన్సర్ కీని ఇలా డైన్‌లోడ్ చేసుకోండి...
ఆన్సర్ కీ కోసం http://www.ctet.nic.in/ వెబ్‌సైట్‌లోకి లాగినవ్వాలి. హోం పేజీలో ctet 2022 ఆన్సర్‌కీపై క్లిక్ చేయండి. వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేస్తే కీని డిస్‌ప్లే అవుతుంది. దాన్ని డౌన్‌లైడ్ చేసుకోవచ్చు.
అభ్యంతరాలు వ్యక్తం చేయాలంటే...
సీబీఎస్‌ఈ సీటెట్ అధికారిక వెబ్ సైట్ www.ctet.nic.in ఓపెన్ చేయాలి. హోం పేజ్‌పై కనిపిస్తున్న చాలెంజ్ సబ్మిషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అభ్యంతరం వ్యక్తం చేయాలనుకున్న ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ ఫర్ చాలెంజ్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆన్సర్ ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. రూ. 1000 ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి.. మీ అభ్యంతరాలను తెలుపవచ్చు.