AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..

కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు కాగా, దీనికి సీఎం ఆమోదం తెలిపారు.
➤ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎంకు నివేదించిన సీఎస్ సహా, ఇతర ఉన్నతాధికారులు.
➤ కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయన్న అధికారులు.
➤ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామన్న అధికారులు.
➤ ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారన్న అధికారులు.
➤ సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు.. అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నామన్న అధికారులు.
➤ వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనాయంత్రాంగం నిర్మాణం, పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేశామన్న అధికారులు.
➤ కొత్తజిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్‌లిస్టు కూడా తయారుచేశామని తెలిపిన అధికారులు.
➤ కొత్త జిల్లాలకు సంబంధించి నూతన వెబ్‌సైట్లు, కొత్త యంత్రాంగాలు ఏర్పాటవుతున్నందున వాటికి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు.. తదితర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని తెలిపిన అధికారులు.
➤ అలాగే కొత్త జిల్లాల సమాచారంతో కూడిన హ్యాండ్ బుక్స్ కూడా తయారు చేసినట్టు వెల్లడించిన అధికారులు.
➤ కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని తెలిపిన అధికారులు.
➤ సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేటు భవనాలను అద్దె ప్రాతిపదికిన తీసుకున్నామని తెలిపిన అధికారులు
సీఎం కీలక ఆదేశాలు..
☛ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు.
☛ కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాలకోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలి.
☛ కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలి.
☛ కలెక్టర్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలి.
☛ అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
☛ ఈ భవనాలకోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలి.
☛ పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలి.
☛ ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అధికారులకు స్పష్టం చేసిన సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, ప్లానింగ్ సెక్రటరీ వి విజయకుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
రెవెన్యూ డివిజన్లూ పునర్ వ్యవస్థీకరణ..
రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
➤ అరకు లోక్‌సభ స్థానం రెండు జిల్లాలుగా విభజన
➤ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా
➤ రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి
➤ అమలాపురం కేంద్రంగా కోనసీమ..
➤ భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి
➤ విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా
➤ మచిలీపట్నం కేంద్రంగా మచిలీపట్నం
➤ తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా
➤ పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా
అతి పెద్ద జిల్లా ప్రకాశం..అతి చిన్న జిల్లాగా..
రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునరి్వభజించింది. పునర్వ్యస్థీకరణ తర్వాత 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.
రెండు పార్లమెంటు స్థానాల్లో విస్తరించిన మండలాలు..
☛ రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలు 5 ఉన్నాయి.
☛ అనంతపురం రూరల్ మండలం అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
☛ విజయనగరం జిల్లా జామి మండలం విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో ఉంది.
☛ విజయవాడ రూరల్ మండలం మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో ఉంది.
☛ తిరుపతి రూరల్ మండలం చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉంది.
☛ పెదగంట్యాండ మండలం అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
☛ ఈ మండలాలను ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానం ఉన్న జిల్లా పరిధిలోనే ఉంచనున్నారు. దీని ప్రకారం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లాలో, జామి మండలం విజయనగరంలో, విజయవాడ రూరల్ విజయవాడలో, తిరుపతి రూరల్ మండలం తిరుపతిలో, పెదగంట్యాడ విశాఖ జిల్లాలో ఉంటాయి. దీంతో ఏ మండలమూ రెండు జిల్లాల పరిధిలో ఉండదు.
పునర్విభజన తర్వాత జిల్లాలు ఇలా ఉంటాయి..
1. శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు : 2 (టెక్కలి, శ్రీకాకుళం)
మండలాలు : 30
విస్తీర్ణం : 4,592 చ.కి.మీ.
జనాభా : 21.91 లక్షలు
2. విజయనగరం
జిల్లా కేంద్రం : విజయనగరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (విజయనగరం, బొబ్బిలి (కొత్త))
మండలాలు : 26
విస్తీర్ణం : 3,846 చ.కి.మీ.
జనాభా : 18.84 లక్షలు
3. విశాఖపట్నం
జిల్లా కేంద్రం : విశాఖపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు : 2 ( భీమిలి (కొత్త), విశాఖపట్నం)
మండలాలు : 10
విస్తీర్ణం : 928 చ.కి.మీ.
జనాభా : 18.13 లక్షలు
4. అనకాపల్లి
జిల్లా కేంద్రం : అనకాపల్లి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (అనకాపల్లి, నర్సీపట్నం)
మండలాలు : 25
విస్తీర్ణం : 4,412 చ.కి.మీ.
జనాభా : 18.73 లక్షలు
5. కాకినాడ
జిల్లా కేంద్రం : కాకినాడ
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం,
కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పెద్దాపురం, కాకినాడ)
మండలాలు : 19
విస్తీర్ణం : 2,605 చ.కి.మీ.
జనాభా : 19.37 లక్షలు
6. కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం : అమలాపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (అమలాపురం, రామచంద్రాపురం)
మండలాలు : 24
విస్తీర్ణం : 2,615 చ.కి.మీ.
జనాభా : 18.73 లక్షలు
7. తూర్పు గోదావరి
జిల్లా కేంద్రం : రాజమహేంద్రవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు : 2 (రాజమహేంద్రవరం, కొవ్వూరు)
మండలాలు : 20
విస్తీర్ణం : 2,709 చ. కి.మీ.
జనాభా : 19.03 లక్షలు
8. పశ్చిమ గోదావరి
జిల్లా కేంద్రం : భీమవరం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు : 2 (నర్సాపురం, భీమవరం(కొత్త))
మండలాలు : 19
విస్తీర్ణం : 2,178 చ.కి.మీ.
జనాభా : 17.80 లక్షలు
9. ఏలూరు
జిల్లా కేంద్రం : ఏలూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి)
రెవెన్యూ డివిజన్లు : 3 (ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం)
మండలాలు : 27
విస్తీర్ణం: 6,413 చ.కి.మీ.
జనాభా: 20.03 లక్షలు
10. మచిలీపట్నం
జిల్లా కేంద్రం : మచిలీపట్నం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు)
రెవెన్యూ డివిజన్లు : 2 (గుడివాడ, మచిలీపట్నం)
మండలాలు : 25
విస్తీర్ణం : 3,775 చ.కి.మీ.
జనాభా : 17.35 లక్షలు
11. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా
జిల్లా కేంద్రం : విజయవాడ
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్,
విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం)
రెవెన్యూ డివిజన్లు : 3 (నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త), విజయవాడ)
మండలాలు : 20
విస్తీర్ణం : 3,316 చ.కి.మీ.
జనాభా : 22.19 లక్షలు
12. గుంటూరు
జిల్లా కేంద్రం : గుంటూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు)
రెవెన్యూ డివిజన్లు : 2 (గుంటూరు, తెనాలి)
మండలాలు : 18
విస్తీర్ణం : 2,443 చ.కి.మీ.
జనాభా : 20.91 లక్షలు
13. పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం : నరసరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : 2 (గురజాల, నరసరావుపేట)
మండలాలు : 28
విస్తీర్ణం: 7,298 చ.కి.మీ.
జనాభా : 20.42 లక్షలు
14. బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం : బాపట్ల
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు,
అద్దంకి, చీరాల)
రెవెన్యూ డివిజన్లు : 2 (బాపట్ల (కొత్త), చీరాల(కొత్త))
మండలాలు : 25
విస్తీర్ణం : 3,829 చ.కి.మీ.
జనాభా : 15.87 లక్షలు
15. ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం : ఒంగోలు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం)
రెవెన్యూ డివిజన్లు : 3 (మార్కాపురం, ఒంగోలు, పొదిలి (కొత్త))
మండలాలు : 38
విస్తీర్ణం : 14,322 చ.కి.మీ.
జనాభా : 22.88 లక్షలు
16. నంద్యాల
జిల్లా కేంద్రం : నంద్యాల
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానిపల్లె,
డోన్, నందికొట్కూర్, శ్రీశైలం)
రెవెన్యూ డివిజన్లు : 3 (నంద్యాల, డోన్(కొత్త), ఆత్మకూరు(కొత్త))
మండలాలు : 27
విస్తీర్ణం : 9,155 చ.కి.మీ.
జనాభా : 16.87 లక్షలు
17. కర్నూలు
జిల్లా కేంద్రం : కర్నూలు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ)
రెవెన్యూ డివిజన్లు : 2 (కర్నూలు, ఆదోని)
మండలాలు : 28
విస్తీర్ణం : 8,507 చ.కి.మీ.
జనాభా : 23.66 లక్షలు
18. అనంతపురం
జిల్లా కేంద్రం : అనంతపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి)
రెవెన్యూ డివిజన్లు : 3 ( కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్)
మండలాలు : 34
విస్తీర్ణం : 11,359 చ.కి.మీ.
జనాభా : 23.59 లక్షలు
19. శ్రీ సత్యసాయి జిల్లా
జిల్లా కేంద్రం : పుట్టపర్తి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (మడకశిర, హిందూపురం, పెనుకొండ,
పుట్టపర్తి, కదిరి, ధర్మవరం)
రెవెన్యూ డివిజన్లు : 3 (ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి (కొత్త))
మండలాలు : 29
విస్తీర్ణం : 7,771 చ.కి.మీ.
జనాభా : 17.22 లక్షలు
20. వైఎస్సార్ జిల్లా
జిల్లా కేంద్రం : కడప
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు)
రెవెన్యూ డివిజన్లు : 3 (కడప, జమ్మలమడుగు, బద్వేల్)
మండలాలు : 34
విస్తీర్ణం : 10,723 చ.కి.మీ.
జనాభా : 19.90 లక్షలు
21. ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు
జిల్లా కేంద్రం : నెల్లూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు)
రెవెన్యూ డివిజన్లు : 3 (కావలి, నెల్లూరు, ఆత్మకూరు)
మండలాలు : 35
విస్తీర్ణం : 9,141 చ.కి.మీ.
జనాభా : 23.37 లక్షలు
22. బాలాజీ జిల్లా
జిల్లా కేంద్రం : తిరుపతి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి,
తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు)
రెవెన్యూ డివిజన్లు : 3 (గూడూరు, తిరుపతి, నాయుడుపేట)
మండలాలు : 35
విస్తీర్ణం : 9,176 చ.కి.మీ.
జనాభా : 22.18 లక్షలు
23. అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం : రాయచోటి
అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి,
తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు)
రెవెన్యూ డివిజన్లు : 3 (మదనపల్లె, రాజంపేట, రాయచోటి (కొత్త))
మండలాలు : 32
విస్తీర్ణం : 8,459 చ.కి.మీ.
జనాభా : 17.68 లక్షలు
24. చిత్తూరు
జిల్లా కేంద్రం : చిత్తూరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు)
రెవెన్యూ డివిజన్లు : 2 (చిత్తూరు, పలమనేరు (కొత్త))
మండలాలు : 33
విస్తీర్ణం : 7,210 చ.కి.మీ.
జనాభా : 19.85 లక్షలు
25. మన్యం జిల్లా
జిల్లా కేంద్రం : పార్వతీపురం
అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పాలకొండ, పార్వతీపురం)
మండలాలు : 16
విస్తీర్ణం : 3,935 చ.కి.మీ.
జనాభా : 9.72 లక్షలు
26. అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం : పాడేరు
అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు : 2 (పాడేరు, రంపచోడవరం)
మండలాలు : 22
విస్తీర్ణం : 12,251 చ.కి.మీ.
జనాభా : 9.54 లక్షలు